నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని నిజామాబాద్ ట్రాఫిక్ ఏసిపి నారాయణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వినాయక్ నగర్‌లో గల రిలయన్స్ మాల్ లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ నారాయణ, ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, ఎస్‌ఐ చంద్రమోహన్, సిబ్బంది ఆధ్వర్యంలో ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ అనే అంశాలపై క్షుణ్ణంగా సిబ్బందికి వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది రిలయన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.