అందరూ పొదుపు చేయటం అలవాటు చేసుకోవాలి: 2కే రన్ ను ప్రారంభించిన కలెక్టర్

– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో, ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు: జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
పొదుపు చేయడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు.సోమవారం కొత్త బస్టాండ్ వద్ద 2కె రన్ ను లీడ్ బ్యాంక్ మేనేజర్ చింతల బాపూజీ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి సద్దుల చెరువు వరకు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తు ర్యాలీ సాగింది,ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 వరకు ఆర్థిక అక్షరాస్యత వారాన్ని పాటిస్తుందని తెలిపారు. పొదుపు ఆవశ్యకత గురించి తెలియజేస్తూ అలాగే సైబర్ క్రైమ్ ల పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని పలు కార్యక్రమాలు చేపట్టనున్నారని కలెక్టర్ తెలిపారు. ఈ వారంలో ప్రజలకు ఎక్కువగా సైబర్ క్రైమ్ లో పట్ల అవగాహనపరిచే విధంగా బ్యాంక్ అధికారులు పలు కార్యక్రమాలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. నిర్వహించిన 2 కే రన్ లో సుమారుగా 450 మంది యువతీ యువకులు ఉద్యోగులు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.