– ఇంటింటా మొక్కల పంపిణీ..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలను నాటాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో తెలంగాణ వనమహోత్సవంలో భాగంగా ఇంటింటా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలకు కాంగ్రెస్ నాయకులు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పెద్దూరి తిరుపతి,మాజీ వార్డు సభ్యులు రెడ్డి పరుశురాములు,కాంగ్రెస్ నాయకులు భరత్, శ్రీకాంత్ గౌడ్, బాలు పాల్గొన్నారు.