పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలి: బొమ్మరబోయిన కేశవులు

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మరబోయిన కేశవులు తన కూతురు వేదశ్రీ తో కలిసి ముశంపల్లి లోని అటవీశాఖ ప్లాంటేషన్ క్షేత్రంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జిల్లా అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి, బీట్ ఆఫీసర్ సౌజన్య, ఎస్. హెచ్.పీ.ఎస్ నాయకులు మెండు అఖిల్ రెడ్డి, అటవీశాఖ సిబ్బంది కిరణ్, రవిచంద్ర, లలిత తదితరులు పాల్గొన్నారు.