పరిశుభ్రత పద్ధతిన కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి..

Everyone should participate in the hygiene program.– జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
పరిశుభ్రత, పారిశుధ్యం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై  గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం రోజు పారిశుద్ధ్యం పనుల పై కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రతి గ్రామములో పారిశుద్ధ్యం  పనులు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. రోడ్లకు  ఇరువైపుల గల పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు..ప్రతి ఇంటి నుండి  తడి చెత్త , పొడి చెత్త సేకరించి,వచ్చిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించలన్నారు . డంపింగ్ యార్డ్ లో చెత్త తయారిపై దృష్టి సాధించాలని తెలిపారు. డంపింగ్ యార్డ్ ల ద్వారా చెత్త రీసైక్లింగ్, డిస్పోస్ చేయడంపై పలు సూచన చేశారు.డంపింగ్ యార్డ్ ల ద్వారా  సాధ్యమైనంత ఎక్కువ వర్మి కంపోస్ట్ ను తయారీకి కృషి చేయాలి అన్నారు.100%, సెగ్రిగేషన్ షెడ్ లను ఉపయోగలోకి తీసుకుని రావాలని తెలిపారు.సెగ్రిగేషన్ షెడ్ ల ముందు కానీ, వేరే కాళీ ప్రదేశాలలో కానీ చెత్త వేసి తగలపెట్టరాదు.డంపింగ్ యార్డ్ ల వల్ల  త్రాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలన్నారు. పరిశుభ్రమైన త్రాగునీరు సరఫరా కోసం ట్యాంకులో క్లోరినేషన్  చేపట్టాలన్నారు. మురికి నీటి కాల్వలు శుభ్రం చేయుట మొదలగు కార్యక్రమములు ఖచ్చితంగా నిర్వహించవలెనని మరియు గ్రామము లో గల పల్లె ప్రకృతి వనము, బృహత్ పల్లె ప్రకృతి వనము, అవెన్యూ ప్లాంటేషన్ , కమ్యూనిటి ప్లాంటేషన్ , నర్సరీ, వైకుంఠ దామము, మొదలగు ప్రదేశములలో చేయవలసిన పనులు  పూర్తి స్తాయిలో  నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయితీ సెక్రటరీ,  మండల పంచాయతీ అధికారులు,  మండల పరిషత్ అభివృద్ధి అధికారులను  ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శి ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల వరకు డైలీ శానిటేషన్ రిపోర్ట్  పూర్తి చేసి , పంపాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి సునంద, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.