ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి

– గఫ్ఫార్ అహ్మద్ ఇ-జిల్లా మేనేజర్ (ఈడియం)
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలి.ఆయా గ్రామాల్లో సమస్యలకు పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈ జిల్లా మేనేజర్ గఫ్ఫార్ మహమ్మద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నూతన ఆలోచనలు, ఆవిష్కరణలకు మంచి వేదిక ఇన్నోవేటర్ అని తెలిపారు.యువత, రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు, మెకానిక్ కి ఇలా అన్ని వర్గాల వారు పాల్గొనవచ్చు అని తెలిపారు.పరిస్కారం చూపే ఏ ప్రయోగ ఆవిష్కరణ అయినా పోటీకి సుపించవచ్చు అని తెలిపారు.ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి స్వాతంత్రదినోత్సవం రోజున ప్రశంసాపత్రాలు, బహుమతులను అందజేస్తారు అని తెలిపారు. ప్రజలు ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఆయన పేర్కొన్నారు.
ఆవిష్క కర్తలకు మంచి అవకాశం..
– కె.రాజు జిల్లా కోఆర్డినేటర్…
వినూత్నంగా ఆలోచించే వారికీ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం మంచి  వేదిక అని జిల్లా కోఆర్డినేటర్ కే రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.నూతన ఆవిష్కరణలు, పోటీలపై అన్ని మండలాల్లో,, గ్రామాల్లో,,ఆవగాహన కల్పిస్తున్నాం అన్నారు. పోస్టర్లు, కరపత్రలు,, వాట్సాప్ గ్రూప్ ల  ద్వారా  సమాచారాన్ని వివరిస్తూ చైతన్యపరుస్తున్నాం అని తెలిపారు.
ఆవిష్కరణల సంఖ్య పెంచి వాటిని రూపొందించే వారిని ప్రోత్సచేందుకు పర్యవేక్షణలో కృషి చేస్తున్నాం అని తెలిపారు. ఆగస్టు 3వ తేదీ లోపు తగు వివరాలతో దరఖాస్తులను వాట్సాప్ ద్వారా పంపించాలి ఆయన పేర్కొన్నారు.