ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో తమ పనులు నిర్వహించాలని మధుసుధానానంద సరస్వతి స్వామిజీ భక్తులకు సూచించారు.శుక్రవారంమం డలంలోని లింగాపూర్ గ్రామంలో 108 జంటలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గ్రామస్తుల సహకారంతో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ మధుసుధానానంద సరస్వతి స్వామి జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో తమ పనులు నిర్వహించాలని సూచించారు. చేసే పనిపై శ్రద్ధ లేకపోతే మంచి ఫలితాన్ని సాధించలేమన్నారు.పూజా సమయం లో భగవంతుడి నామస్మరణ చేస్తూ నిర్వహించా లని అన్నారు.సత్యనారాయణ స్వామి వారి వ్రతం లో పాల్గొన్న, దంపతులకు, గ్రామస్తులకు స్వామి వారి సందేహాన్ని వివరించారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతం సందర్భంగా ఉదయాన్నే పూజ లో పాల్గొనే దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి వ్రతంలో పాల్గొన్నారు. అనంతరం అన్నదా న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి, భక్త బృందం, గ్రామస్తులు పాల్గొన్నారు.