ప్రతి ఒక్కరూ తమ నివాస గృహాల ముందర మొక్కలను నాటి పర్యవరణ పరిరక్షణకు పాటుపడే విధంగా చూడాలని ఎంపీడీవో అనంత్ రావు పిలుపునిచ్చారు. బుదవారం ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామంలో అర్ డ్లుఎస్ ఏఈ, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి డిప్ చంద్ తో కలిసి గ్రామ పంచయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి మొక్కలను ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని తమ ఇంటి ముందర ఖలి స్థలాల్లో మొక్కలను నాటాలన్నారు. ఇదే కాకుండా పెండ్లి పుట్టినరోజు సందర్భాలను బట్టి మొక్క నాటాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమం లో గ్రామపంచాయతీ కార్యదర్శి నాగేష్,కరోబర్ నర్సయ్య తోపాటు మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
తీపి సిబ్బంది కి రైన్ కోర్ట్ లు అందజేత..
ఇందల్ వాయి మండలంలోని సంస్థాన్ సిర్నపల్లి గ్రామ పంచాయతీ లో వీధులు నిర్వర్తిస్తున్నా పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని రైన్ కోర్ట్ లను బుధవారం ఎంపీడీవో అనంతరావు గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి డీప్ చంద్ ల ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రత గ్రామంగా ఉంచడానికి గ్రామపంచాయతీలో విధులు నిర్వహించే సిబ్బంది కృషి తినలేనిది అన్నారు వర్షాకాలంలో వ్యాధులు ప్రబాలకుండా వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సిబ్బంది వీధులు నిర్వహిస్తారని వారి కోసం గ్రామపంచాయతీ నిధుల నుండి రైన్ కోట్లను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నగేష్ కారోబార్ నరసయ్యతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.