గాంధారి మండలంలోని కరక్ వాడి గ్రామంలో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం లో భాగంగా కరక్ వాడి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా తహశీల్దార్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి చెట్లు పెంచి బావి తరాలకు మంచి వాతావరణం నెలకొల్పాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉమ్మాజి భాస్కర్ రావు, ఆశ వర్కర్ శివానిలా, వి వో రోజా, శ్యామరావు, కమలాకర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.