హుస్నాబాద్ పట్టణంలో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని రెండో వార్డులో కౌన్సిలర్ బోసు రమాదేవి రవీందర్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణాన్ని పచ్చదనంతో చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత , మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, ఆర్ పి శ్రీలత ఆశాలు జాల వాని ఆశా కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది గడిపేసారయ్య మంద ప్రభాకర్ పైసా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.