ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటే విధంగా చూడాలని ప్రధానోపాధ్యాయులు పవన్ కుమార్ అన్నారు.శనివారం డిచ్ పల్లి మండలం లోని అమృత పూర్ గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాల లో శిక్షా సప్తాహి” (SHIKSH SAPTAH) లో భాగంగా విద్యార్థులచే పాఠశాలలో మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా ప్రధానోపాద్యాయులు యం.ఎల్. పవన్ కుమార్,ఉపాధ్యాయులు విజయలక్ష్మి, ఎస్.రమాదేవి, యం రాజేశ్వర్ చెట్ల అవత్యకత లను వివరించారు. మొక్కలు లేనిచో మానవ జాతి మనుగడ కష్ట సాధ్యమైతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ 10 మొక్కలు నాటి పెంచిన కాలుష్యాన్ని తగ్గించడానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.