భవిష్యత్‌ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

భవిష్యత్‌ తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి– వన మహౌత్సవం యజ్ఞంల కొనసాగాలి
– ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
భవిష్యత్‌ తరాలు బాగుండాలంటే, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మొక్కలు నాటి వాటిని సంరక్షించినప్పుడే ఆక్షిజన్‌ ప్రాణ వాయువును కాపాడుకోగలమని ఎమ్మెల్సీ నవీన్‌ కుమార్‌ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ అన్నారు. శుక్రవారం షాద్‌నగర్‌ పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో వన మహౌత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాద్‌నగర్‌ పట్టణంలో లక్షా పది వేల మొక్కలు నాటాలని అన్నారు. వన మహౌత్సవం యజ్ఞంల కొనసాగాలని, భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణం ఉండాలంటే మొక్కలు నాటాలన్నారు. ప్రతి ఒక్కరూ ఒక్క మొక్క నాటి, వాటిని సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మెన్‌ నరేందర్‌, వైస్‌ చైర్మెన్‌ నటరాజన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ వెంకన్న, డిగ్రీ కళాశాల లెక్చరర్‌ డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి, చెంది తిరుపతిరెడ్డి, విశాలా విశ్వం, బాలరాజ్‌ గౌడ్‌, కృష్ణ, కౌన్సిలర్లు జూపల్లి కౌసల్య, పిల్లి శారద శేఖర్‌, జి టి శ్రీనివాస్‌, ఆలోనిపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, ఈశ్వర్‌ రాజు, ముబారక్‌ ఖాన్‌, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.