– కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
– కుమారుని జ్ఞాపకార్థం ఏలే నిరంజన్ సేవలు అభినందనీయం
– ఏలే మనోజ్ జ్ఞాపకార్థం అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే
– ఆమనగల్ బస్టాండ్ లో మహిళలతో ముచ్చటించిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-ఆమనగల్
ప్రతి ఒక్కరూ సమాజ సేవకు పునరంకితం కావాలని అన్ని దానాల్లోకి అన్నదానం మహాదాన మని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్ పట్టణానికి చెందిన ప్రముఖ జర్నలిస్ట్, మన తెలంగాణా పత్రిక విలేకరి ఏలే నిరంజన్ తన కుమారుడు ఏలే మనోజ్ జ్ఞాపకార్థం ఆదివారం ఆమనగల్ బస్టాండ్ ఆవరణలో లయన్స్ క్లబ్ సహకారంతో మీల్స్ ఆన్ వీల్స్ ద్వారా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మనోజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయ ణరెడ్డి హాజరై మాట్లాడారు. అనారోగ్యంతో మృతి చెందిన తన కుమారుని జ్ఞాపకార్థం నిరంజన్ చేప డుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీ యమ న్నారు. నిరంజన్‌ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజ సేవకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బస్టాండ్ ఆవరణలో ఉన్న మహిళలతో ఎమ్మెల్యే ముచ్చటించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత బస్సు ప్రయాణం గురించి మహిళలను ప్రశ్నించగా వారు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యవర్గ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్‌గౌడ్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్లు గౌడ్, జిల్లా చైర్మెన్ జూ లూరు రమేష్, సీఐ విజరు కుమార్, ఎస్‌ఐ బా ల్‌రామ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ ముదిరాజ్, మండలాధ్యక్షులు తెల్గమల్ల జగన్, పట్టణాధ్యక్షులు వస్పుల మానయ్య, జిల్లా నాయ కులు కృష్ణ నాయక్, ఎంగలి ప్రసాద్, కడ్తాల్ మండ లాధ్యక్షులు సబావత్ బిచ్యా నాయక్, కేఎన్‌ఆర్ సేవాదళం అధ్యక్షులు మెకానిక్ బాబా, జిల్లా నాయ కులు విజరు రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.