
ప్రతి ఒక్కరూ మీ చెట్లకు నీటిని అందించి వాటిని సంరక్షించాలని మండల అభివృద్ధి అధికారి బాలకిషన్ పేర్కొన్నారు. శుక్రవారం వాటర్ డే ను పురస్కరించుకొని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలకు నీటిని అందించారు. అలాగే అన్ని గ్రామపంచాయతీలలో కూడా వాటర్ డే కార్యక్రమం చేపట్టి చెట్లకు నీరు పట్టవలసిందిగా పంచాయతీ కార్యదర్శులు ఆదేశించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో టి ఏ రాజు, బ్రహ్మచారి, సీనియర్ అసిస్టెంట్ సూర్య తదితరులు పాల్గొన్నారు.