– సర్పంచ్ సంఘం జిల్లా అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ రవీందర్‌గౌడ్
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్రతి ఒక్కరూ గురువులను గౌరవించాలని సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు, మిర్జాగూడ గ్రామ సర్పంచ్ రవీందర్‌గౌడ్ అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం పురస్క రించుకొని బుధవారం మీర్జాగూడ, ఇంద్రారెడ్డినగర్, మేకాన్గడ్డ పాఠశా లలకు చెందిన ఉపాధ్యాయులను, అంగన్వాడీ టీచర్లను ఇంద్రారెడ్డి నగర్ పాఠశాల ఆవరణలో వార్డు సభ్యులు వై.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. దేశాన్ని ,రాష్ట్రాన్ని ,జిల్లా , మండలాలను గ్రామాలను పరిపాలిస్తున్న నాయకులు, అధికారులు కూడా ఒకప్పుడు గురువుల వద్ద విద్య నేర్చుకున్న వారేనని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ గురువును తప్పనిసరిగా గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వై. చిట్టెమ్మ, శారద, వై. ప్రవీణ్ కుమార్, కోట రాజుగౌడ్, ఇంద్రారెడ్డి నగర్ పాఠశాల ఉపాధ్యాయులు సిహెచ్.యాదయ్య, ఊరడి వెంకటేష్, మీర్జాగూడ పాఠశాల ఉపాధ్యాయులు వీణ, శ్రీనివాసరెడ్డి, మేకాన్ గడ్డ పాఠశాల ఉపాధ్యాయులు విజయలక్ష్మి, వెంకటేష, మౌనిక ,తులసి, కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.