వన మహోత్సవంలో ప్రతి ఒక్కరు బాధ్యతలు పంచుకోవాలి

Everyone should share responsibilities in Vana Mahotsavaనవతెలంగాణ – మాక్లూర్ 
అడవుల విస్తీర్ణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వన మహోత్సవం కార్యక్రమంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతలను పంచుకొని మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తూ చెట్లుగా పెంచాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని చీన్నపూర్, మామిడిపల్లి గ్రామ శివారులో గల  అర్బన్ పార్క్ ఏరియాలో అటవీ శాఖ అధికారులతో, బిజెపి నాయకులతో కలిసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ప్రతి ఒక్కరూ ఈ ఐదు రోజులపాటు స్వచ్ఛ ధనం పచ్చదనంలలో పరిసరాలను పరిశుభ్రం చేయడంతో పాటు భావితరాల బాగు కోసం మొక్కలు నాటి వాటి పెంపకాలను చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బిజెపి మండల అధ్యక్షుడు సురేష్ నాయక్, జిల్లా బిజెపి ప్రతినిధి సంతోష్, బిజెపి నాయకులు వినోద్ , ఆర్మూర్ అటవీశాఖ అధికారి శ్రీనివాస్, డిప్యూటీ రేంజ్ అధికారులు అశోక్, సుధాకర్, శ్రీదేవి, ఎఫ్ఎస్ఓ గణేష్, ఎఫ్ బి ఓ లు రజిత, సంగీత, సుశీల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.