వ్యాధులు రాకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి

– మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న 
నవతెలంగాణ-  హుస్నాబాద్ రూరల్ 
వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శనివారం హుస్నాబాద్ పట్టణంలోని పోచమ్మ వాడలో ఇంటింటి కి తిరుగుతూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.. జలుబు, దగ్గు, డెంగ్యూ దగ్గర వ్యాధులు వస్తున్నాయని, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. .ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఐ లేని అనిత, రెండో వార్డ్ కౌన్సిలర్ బోజు రమాదేవి, వైద్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ఉన్నారు