అమరుల ఆకాంక్షలు నెరవేరేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి

– రాష్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు
– టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల జనుల అలుపెరుగని పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని అభిప్రాయపడ్డారు. ఆరు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంతో సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కారం విషయంలో ప్రతిపక్షా లకూ పెద్దపీట దక్కకపోవడం అన్యాయమని చెప్పారు. పోరాడి సాధిం చుకున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పతనం కాకుండా కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం స్ఫూర్తితో సబ్బండ వర్ణాలు మమేకమవుతూ అమరవీరుల ఆకాంక్షలు ఫలించేలా దశాబ్ది ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కాసాని జ్ఞానేశ్వర్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.