గాంధీ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలి

– పద్మనాభుని పల్లి గ్రామ సర్పంచ్ కండ్లకొయ్య పర్షరాములు

నవతెలంగాణ దుబ్బాక రూరల్ :
గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పద్మనాభుని పల్లి గ్రామ సర్పంచ్ కండ్లకొయ్య పర్షరాములు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో జాతిపిత మహాత్మా గాంధీ 154 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గాంధీ కలలు కన్న స్వరాజ్యాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరిస్తూ పాలన కొనసాగిస్తుందన్నారు. స్వాతంత్ర్య సాధనకు ఆయన చేసిన పోరాటం అందరికీ ఆదర్శ ప్రాయమని అన్నారు.కార్యక్రమంలో సెక్రటరీ స్వామి, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, యువత  తదితరులు ఉన్నారు