– కలెక్టర్ ఎస్.వెంకట్రావు
నవతెలంగాణ- చివ్వేంల
ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై నవ బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం షి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం మండలంలోని తిరుమలగిరి( జి ) గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్ల పూర్తి చేసుకుని పదవ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2 నుండి 22వ తేదీ వరకు పండుగల జరుపుకొనుటకు అన్ని ఏర్పాటు చేసిందని, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా 10 సంవత్సరాలలో గ్రామాలలో జరిగిన అభివద్ధిని ప్రజలకు తెలియపరుస్తూ 2014 కంటే ముందు తర్వాత జరిగిన అభివద్ధిని కండ్లకు కట్టినట్టుగా వివరిస్తూ ,ప్రజలకు తెలిసే విధంగా నాడు నేడు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వివరిస్తున్నారని తెలిపారు.అధికారుల కషితో తెలంగాణ అభివద్ధి చెందిందని అధికారుల సమిష్టి కషి వల్ల రాష్ట్ర జిడిపి పెరిగిందని అన్నారు. ఐటీ రంగం అభివద్ధి పరిచి రాష్ట్రంలో 1,32 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, అలాగే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. గ్రామ సర్పంచ్ కంచర్ల నిర్మల గోవింద్ రెడ్డి గ్రామాభివద్ధి గురించి చక్కగా వివరించారని వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మహిళా సంఘాలకు శ్రీనిధి ద్వారా పది రెట్లు ఎక్కువగా రుణాలు అందజేస్తున్నామని, మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను అన్ని ఒక బ్రాండ్ పేరుపై ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు త్వరలో ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ముందుగా 10 ఏండ్లలో సాధించిన ప్రగతిని డిఎల్పిఓ సాంబి రెడ్డి చదివి వినిపించారు. పావని మహిళా మండలి సభ్యురాలు తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివద్ధిని వివరించారు. సీపీిఓ వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పల్లె ప్రగతి గురించి తెలిపారు. అనంతరం సలాం అన్న- సఫాయన్న కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య సిబ్బందికి ఏకరూప దుస్తులు అందజేసి సన్మానించి ,ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సురేష్ కుమార్, సీపీఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రంగారావు, ఎంపీడీవో లక్ష్మి, డిఎల్‌పిఓ సాంబి రెడ్డి, ఎంపీఓ గోపి, ఏపీఓ నాగయ్య, మండల వ్యవసాయ అధికారి ఆశా కుమారి, ఏపీఎం రాంబాబు, ఏఈ లింగనాయక్, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ,అధికారులు పాల్గొన్నారు.