నవతెలంగాణ-లోకేశ్వరం
మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులు రేగుంట రాజేశ్వర్ అన్నారు. మంగళవారం మండలంలోని రాజుర జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అర్చన, చంద్రశేఖర్, శంకర్ సింగ్, మురళీ మనోహర్‌రెడ్డి, విజరు కుమార్, శ్రీధర్ రెడ్డి, గంగాధర్, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో..
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తుపదార్థాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని సీనియర్ లెక్చరర్ గౌతం అన్నారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంతో మానసిక, శారీరక, సామాజిక సమస్యలు తలెత్తుతాయని తెలిపారు, ఇందులో చిన్నయ్య, వెంకటేశ్వర్లు, మహేందర్, సాయినాథ్, వినోద్, శ్రీధర్, విఠల్ పాల్గొన్నారు.