కసిరెడ్డి నారాయణరెడ్డి విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: కసిరెడ్డి మాధవి రెడ్డి

నవతెలంగాణ- తలకొండపల్లి
మండల పరిధిలోని కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి విజయం కోసం ఆయన సతీమణి మాధవి వారి అక్కయ్య రామేశ్వరమ్మ, కుటుంబ సభ్యులు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. గురువారం తలకొండపల్లి మండల పరిధిలోని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి స్వగ్రామం ఖానాపూర్ లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టి ఇంటింటా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కసిరెడ్డి మాధవి రెడ్డి మాట్లాడుతూ కల్వకుర్తి ప్రాంత అభివృద్ధి కై ఎనలేని కృషిచేసిన కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మహిళలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.