సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

నవతెలంగాణ – తుంగతుర్తి
బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ గుండగాని కవిత రాములు గౌడ్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని 365 జాతీయ రహదారి పక్కన గోపగాని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.ఈ మేరకు తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి,ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని,సబ్బండ వర్గాలకు రాజకీయ,సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు.రాచరికపు వ్యవస్థ నీడలో జమీందారులు జాగీర్దార్ల అరాచకాలను సహించలేక కడుపు మండి కత్తి పట్టిన వీరుడతను, దళిత బహుజనులు ఏకమై పోరాడితేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన సామాన్యుడు పాపన్న.సామాన్య గీత కార్మిక కుటుంబంలో జన్మించి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మొగల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి గోల్కొండ కోట పైన బహుజన జెండా ఎగురవేసి,బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.సర్దార్ సర్వాయి పాపన్న జీవితాన్ని నేటితరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య,గౌడ సంఘం నాయకులు గడ్డం ఉప్పలయ్య, పులుసు ఉప్పలయ్య,తీగల వెంకన్న,తొట్ల సుధాకర్ గౌడ్,పులుసు వెంకటనారాయణ గౌడ్,గోపగాని శ్రీనివాస్ గౌడ్, గోపగాని వెంకన్న గౌడ్,తొట్ల రిషి గౌడ్,పాలకుర్తి వీరయ్య, చిర్ర నరేష్,పోడేటి లతీఫ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.