– సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు..
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్: దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు నేటి యువతకు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయం కామ్రేడ్ ధర్మబిక్షం భవనంలో ఆయన 78వ వర్ధంతి సందర్భంగా ఫోటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దొరలు జమీందారులు జాంగిర్లదారులు అరాచకాలు, ఆగడాలను నివారించడానికి జరిగిన పోరాటంలో ఇస్నూరు జమీందార్ రామచంద్రారెడ్డి అక్క జానకమ్మ ఆగడాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్న సందర్భంలో దొడ్డి కొమరయ్య మరణించారని ఈ సాయుధ పోరాటానికి ఊతమిచ్చి మొదటి అమరుడు గా చరిత్రకి ఎక్కారని ఆయన అన్నారు.
నేటి విద్యార్థి యువకులు ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. నేటి పాలకులు పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేసి పాలన అందించాలని నాటి పాలకుల వైఫల్యాలు తిరిగి జరగకుండా చూడాలని పాలకులను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) సీనియర్ జిల్లా నాయకులు వేనేపల్లి వెంకటేశ్వరరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపగాని రవి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూర సైదులు, అయితే గాని కామేష్, పల్సరాజు బండారు శీను తదితరులు పాల్గొన్నారు.