– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి
నవతెలంగాణ నూతనకల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటయోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం మండల కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి అన్నారు గురువారం మండల పరిధిలోని శిల్పకుంట్లలో ఆయన 78వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో సాగుతున్న మతోన్మాద విధానానికి వ్యతిరేకంగా యువత పోరాడాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు తొట్ల లింగయ్య, శాఖ కార్యదర్శి బొజ్జ విజయ్, నాయకులు సామ సురేందర్ రెడ్డి, బాణాల విజయ రెడ్డి, గునిగంటి లింగయ్య, గజ్జల్ల కృష్ణారెడ్డి, జటంగి లింగయ్య, మున్న మహేష్, కూసు ప్రవీణ్, తొట్ల ఆనంద్, గునిగంటి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు