నవతెలంగాణ – ఆర్మూరు
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవికుమార్, సామాజిక సేవకులు పట్వారి తులసి కుమార్ కలిసి మొక్కలు నాటి గ్రీన్ చాలెంజ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ వర్షాకాలంలో మొక్కలు ఇంటి ఆవరణలో ఆఫీస్ ఆవరణలో పాఠశాల కళాశాల స్థాయిలో నేటి యువత విద్యార్థులు ప్రజలు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని కోరారు. ఈ సందర్భంగా పట్వారి తులసి వ్యక్తిగతంగా దేశ శ్రేయస్సుకు ఉపయోగపడే ఆలోచనలతో ముందుకు వెళ్లడం అభినందనీయమని అన్నారు.