పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

Everyone should work to protect the environment– రిటైర్డ్ నిట్ ప్రొఫెసర్ తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ ఫోర్త్ జోన్ కోఆర్డినేటర్  కొత్త లక్ష్మారెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నిట్ రసాయన శాస్త్ర విభాగపు రిటైర్డ్ ప్రొఫెసర్ కొత్త లక్ష్మారెడ్డి కోరారు. మునిగలవేడు ఉన్నత పాఠశాలలో  నిర్వహించిన పర్యావరణ మరియు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న అధ్యక్షతన సదస్సును ఏర్పాటు చేశారు
ఈ సందర్భంగా ఆయనతోపాటు విశ్రాంత అటవీ శాఖ పురుషోత్తం. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే చుట్టూ ఉన్న మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్య సమాజం ఏర్పడుతుందన్నారు. మునిగలివీడు పాఠశాలలో చదివి  ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి ఇదే పాఠశాలలో మాట్లాడడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. పాఠశాలలో చదువుతున్నప్పుడు జరిగిన అనుభూతులను విద్యార్థులతో పంచుకున్నారు. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణపరంగా అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ప్లాస్టిక్ రేణువులు శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ కు దారితీస్తున్నాయన్నారు. ప్లాస్టిక్ వాడకం పెరగడంతో ప్రపంచంలోనే భారత దేశంలో క్యాన్సర్ సంఖ్య ఎక్కువగా పెరుగుతుందన్నారు. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే ముందు తరాలకు మనుగడ ఉంటుదన్నారు. విశ్వాసాలు ఉండవచ్చు కానీ మూఢవిశ్వాసాలు ఉండకూడదని తెలిపారు. మూఢనమ్మకాలతో ప్రజలు భయపడుతున్న ప్రాంతానికి వెళ్లి శాస్త్రీయంగా అక్కడి ప్రజలకు వివరించి చైతన్యం చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మనిషికి గాలి నీరు ఆహారం ఎంత అవసరమో విద్య కూడా అంతే అవసరం అన్నారు. ఈ పాఠశాలలో చదివి ఎంతోమంది ఉన్నతంగా ఎదిగి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. విద్యార్థులు కూడా ఉన్నతంగా చదివి ఆదర్శంగా నిలవాలని సూచించారు. పర్యావరణ కాలుష్యం ఏ విధంగా ఏర్పడుతుందో వివరించారు. కాలుష్యం వల్ల భూ ఆవరణం, జీవావరణం ఎలా దెబ్బతింటుందో వివరించారు. ప్రతి పాఠశాలలో గ్రీన్ క్లబ్ ,సైన్స్ క్లబ్ ,కంపోస్ట్ గుంత ఉండాలని సూచించారు .ప్రతి విద్యార్థి శాస్త్రీయదృక్పథాన్ని  అలవర్చుకొని పర్యావరణ విద్వంసం కాకుండా చూడాలని కోరారు. విజ్ఞానాన్ని పెంచుకొని ,పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ప్లాస్టిక్ వస్తువుల వల్ల కలిగే నష్టాలపై ప్రదర్శించిన నాటికను తిలకించి విద్యార్థులను అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మరియు ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీ ,డ్రాయింగ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు కే యాదగిరి జనవిజ్ఞాన వేదిక నెల్లికూదురు మండలాధ్యక్షులు యాకన్న,పాఠశాల ఉపాధ్యాయులు రామ్మోహన్ రెడ్డి ,  రామస్వామి , సలీం , భవాని ,సుదర్శన్ ,మోహనా చారి ,  మురళీకృష్ణ ,వెంకటేశ్వర్లు, యాకయ్య, రంజిత్ కుమార్, నాగరాణి ,అమర్, ప్రసాద్ రావు,బోధనేతర సిబ్బంది వెంకట్ రాములు, రఫీ తదితరులు పాల్గొన్నారు.