నల్ల పోచమ్మ జాతరకు అంతా సిద్ధం..

– గత వారం నుంచి ఆలయాలంకరణలో నిమగ్నమైన ఆలయ కమిటీ సభ్యులు…
–  ప్రతి సంవత్సరం వేలాదిగా తరలివస్తున్న భక్తులు…
– వారం రోజులపాటు రద్దీగా మండల కేంద్రం..
నవతెలంగాణ – నాగిరెడ్డి పెట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల నల్ల పోచమ్మ ఆలయ వద్ద నేడు నిర్వహించే ఎడ్లబండ్ల ప్రదర్శనకు అంత సిద్ధమైనట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.  గత కొన్ని సంవత్సరాలుగా ఉగాది పండుగను పురస్కరించుకొని ఉగాది పండుగ రోజు నల్ల పోచమ్మ ఆలయం చుట్టూరా ఎడ్ల పండ్ల ప్రదర్శనను నిర్వహిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించే ఎడ్లబండ్ల ప్రదర్శనకు మండల కేంద్రంతో పాటు చుట్టూర గ్రామాలు నుండి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది.  నల్ల పోచమ్మ జాతరగా పిలువబడే ఉత్సవం వేలాది మందితో కిటకిటలాడుతుంది. ఉగాది రోజు ఎడ్లబండ్ల ప్రదర్శన రెండవ రోజు బోనాల నిర్వహణ మూడో రోజు రాత్రి రథోత్సవం నిర్వహిస్తారు. మండల కేంద్రంతోపాటు చుట్టూరా గ్రామాలన్నీ మండల కేంద్రానికి చేరుకొని ఎడ్ల పనుల ప్రదర్శనలు పాల్గొంటారు. వారం రోజులపాటు మండల కేంద్రంలో గల నల్ల పోచమ్మ ఆలయానికి దర్శనం చేసుకోవడానికి వేలాది మంది తరలివచ్చి తమ మొక్కులను చెల్లించుకుంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఉగాది పండుగను పురస్కరించుకొని నల్లపూచమ్మ జాతరను మండల వాసులు నిర్వహిస్తారు.