– నేడు పోలింగ్
– కలెక్టర్ కోయ శ్రీ హర్ష
నారాయణపేటటౌన్: సోమవారం జరిగే పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు నారాయణపేట జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి సూక్ష్మ పరిశీలకులు, ఫైనల్ ర్యాండ మైజేషన్ ప్రక్రియ ఎన్నికల సాధారణ పరిశీలకులు షెవాంగ్ గ్యాచో భూటియా, రిటర్నింగ్ అధికారి జి.రవి నాయక్, నారాయణపేట జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్షల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా సమీకత కలెక్టరేట్లో నిర్వహించారు. రెండు నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాలకు రిజర్వుతో కలుపుకొని 171 మంది సూక్ష్మ పరిశీలకులను అసెంబ్లీ నియోజక వర్గాలకు కేటా యిం చారు. నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 270, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 284 పోలింగ్ కేంద్రాలకు మొత్తం 2,624 మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించారు. నారాయణపేట నియోజకవర్గానికి 320 మంది ప్రిసైడింగ్ అధికారులు, మరో 320 సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 640 ఓపీవోలను తీసుకున్నారు. మక్తల్ నియోజకవర్గానికి 336 మంది ప్రిసైడింగ్ అధికారులు, 336 సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 672 మంది ఓపీవోలను తీసుకున్నారు. నారా యణపేట నియోజకవర్గంలో మొత్తం 2,36,182 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,19,682 ఓటర్లు, పురుషులు 1,16,497 మంది ఉండగా, ముగ్గురు ఇతర ఓటర్లు ఉన్నారు. మక్తల్ నియోజకవర్గంలో 2,44,173 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,19,809 మంది పురు షులు,1,24,363 మంది మహిళలు, ఇతర ఓటరు ఒక్కరు ఉన్నారు. ఎన్నికలు పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బందితో పాటు కేంద్ర సాయుధ బలగాలను మోహరింపచేసినట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలు, అవసరమైన చోట వీడియో తీయించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వారీగా నారాయణపేట నియోజకవర్గంలో మొత్తం 270 పోలింగ్ స్టేషన్లకు 31 రూట్లను, మక్తల్ నియోజకవర్గంలోని 284 పోలింగ్ స్టేషన్లకు 35 రూట్లను సిద్దం చేసినట్లు తెలిపారు. హోెం ఓటింగ్ కోసం నారాయణపేటలో 33 మంది దరఖాస్తు చేసుకోని 32 మంది తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు. మక్తల్లో 8 మంది దరఖాస్తు చేసుకోగా 8 మంది తమ ఓటు హక్కును తమ ఇంటి వద్దనే ఓటు వినియోగించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అత్యవసర సేవలు నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ద్వారా నారాయణపేట జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలోని ఫెసిలిటేశన్ సెంటర్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లను ఆకర్షించడానికి నారాయణపేట నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ కేంద్రాలు, మక్తల్ లో 4 మోడల్ పోలింగ్ కేంద్రాలు, నారాయణపేటలో 5 మక్తల్ లోనూ మరో 5 మహిళా పోలింగ్ కేంద్రాలు, నారాయణపేట, మక్తల్ నియోజ కవర్గాలలో ఒక్కో యువ ఓటర్ల కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వీటితో పాటు రెండు నియోజకవర్గాలలో ఒక్కో దివ్యాంగుల పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.