– నేడు తుక్కుగూడ కేంద్రంగా కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టో విడుదల
– సభ ప్రాగణంలో సకల ఏర్పాట్లు
– సిద్ధం చేసిన టీపీపీసీ
– 60 ఎకరాల్లో సభ ప్రాంగణం
– 300 ఎకరాలు పార్కింగ్‌కు కేటాయింపు
– 10 లక్ష మందిని సమీకరించేందుకు కాంగ్రెస్ శ్రేణుల ప్రణాళికలు
– సభకు ముఖ్యఅతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ జన జాతర సభకు సర్వ సిద్ధమైంది. మూడు రోజులుగా సభ ప్రాగణం ఏర్పాట్లపై టీపీసీసీ, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పరిశీలిస్తూ ఎప్పటికీకప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సభలో ఎలాంటి ఘటనలకు తావు ఇవ్వకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా లోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల తుక్కుగూడలో ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు కాంగ్రెస్ అధిష్టానం తుక్కుగూడ కేంద్రంగా జన జాతర భారీ బహిరంగ సభను శనివారం నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్యఅతిథులుగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. ‘జాతీయ మ్యానిఫెస్టో పాంచ్ న్యారు, 25 గ్యారెంటీలను’ ప్రకటించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమరాన్ని ఇదే వేదిక నుంచి ప్రారంభించింది. ఆరు గ్యారెంటీలతో ప్రజల ముందుకు వెళ్లి విజయం సాధించింది. అదే సెంటిమెంట్‌తో జాతీయ మ్యానిఫెస్టోను కూడా ఇదే వేదిక నుంచి ప్రకటించి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెలంగాణ కాం గ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలి తాలు ఇచ్చిన ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందు కెళ్తోంది. ఈ మేరకు నేడు హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జనజాతర పేరుతో భారీ బహిరంగ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్య క్షతన జరగనున్న ఈ సభకి ఏఐసీసీ అధ్యక్షుడు మ ల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ ముఖ్యనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సైతం హాజరకానుం డటంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. తుక్కుగూడలోని 60 ఎకరాల విశాలమైన మై దానంలో జనజాతర బహిరంగ సభ జరగనుంది. వాహనాల పార్కింగ్‌కు సుమారు 300 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ సభకు ఆదిలాబాద్ మొదలు ఆలంపూర్ వరకు, జహీరాబాద్ నుంచి భ ద్రాచలం వరకు అన్నిగ్రామాలు, పట్టణాలు, నగరా ల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కనీసం పది లక్షల మంది జనజాతర సభకు హాజరవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. మ్యానిఫెస్టో విడుదలతో పాటు దేశం మొత్తం జనజాతర సభ వైపు చూసేలా సభ ఉంటుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. మ రోవైపు తుక్కుగూడను సెంటిమెంట్‌గా భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచే ఎ న్నికల సమరాన్ని ప్రారంభించి విజయం సాధించ డంతో.. ఇప్పుడు ఈ జనజాతర సభతో హిస్టరీ రిపీట్ అవుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నా రు. మరోవైపు తుక్కుగూడ సభ తర్వాత కాంగ్రెస్ మరింత దూకుడుగా ముందుకెళ్తుందని కాంగ్రెస్ క్యాడర్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర పార్టీ
తుక్కుగూడ జన జాతర సభను రాష్ట్ర పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్‌రెడ్డి సభ విజయ వంతం కోసం ముమ్మర కృషి చేశారు. గత వారం రోజుల నుంచే తుక్కుగూడ సభ ఏర్పాట్లను సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి, తదితరులు పర్యవేక్షించారు. మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు సీఎం తుక్కుగూడలో పర్య టించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండ సురేఖ, సీతక్క సభ ఏర్పాట్లపై క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సభ ద్వారా దేశానికి కాంగ్రెస్ తడాఖా చూపించాలని పార్టీ రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు.