– నవీపేట్ మేకల,వారంతపు సంతల వేలం రెండుసార్లు వాయిదా..
– అప్ సెట్ ప్రైస్ రాకుండా అడ్డుకట్ట..
– మధ్యవర్తుల బేరసారాలు..
– మూడోసారి అప్సెట్ అయ్యేనా?
– నష్టపోనున్న గ్రామపంచాయతీ..
– మూడు నెలలుగా పంచాయతీ సిబ్బందికి జీతాలు కరువు ..
– ప్రేక్షక పాత్రలో అధికార యంత్రాంగం
నవతెలంగాణ – నవీపేట్
జిల్లాలోనే అత్యధిక ఆదాయం వచ్చే నవీపేట్ మేకల, వారంతపు సంతల వేలంలో తలపండిన కాంట్రాక్టర్ లు సిండికేట్ కు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మేకల సంత వేలం గత సంవత్సరం రూ.55,16,000 పలకగా, వారాంతపు సంత రూ.15 లక్షలు పలికింది. గ్రామపంచాయతీ కార్యాలయంలో రెండుసార్లు నిర్వహించిన మేకల సంత వేలం పాటకు మొదటిసారి 28 మంది, వారాంతపు సంతకు 10మంది వేలం పాటదారులు హాజరుకాగా మేకల సంతకు రూ.39 లక్షలు, వారంతపు సంతకు ఒక లక్ష రూపాయలు మాత్రమే మజరోద్దీన్ పలకడంతో అప్ సెట్ ప్రైస్ రాకపోవడంతో వేలం పాటను వాయిదా వేశారు. తిరిగి 13వ తేదీ వేలంపాట నిర్వహించగా మేకల సంత వేలం పాటలో 49 మంది పాల్గొనగారూ. 40 లక్షల 35 వేలకు, వారాంతపు సంత వేలంలో 24 మంది పాల్గొనగా 4.61 మంగళవారం లక్షలకు మజరోద్దీన్ పాటలు పాడగా అప్ సేట్ ప్రైస్ రాకపోవడంతో రెండవసారి అధికారులు మంగళవారానికి వాయిదా వేశారు.

సిండికేట్ కు సర్వం సిద్ధం: మేకల, వారంతపు సంతల వేలం పాటలను ఎంపీడీవో నాగనాథ్, ఎంపీఓ రామకృష్ణ, కార్యదర్శి రవీందర్ నాయక్ ల సమక్షంలో నిర్వహించగా వేలం పాటదారులు కొంతమంది మాత్రమే వేలంలో పాల్గొనగా పంచాయతీ ఆవరణలో పాత కాంట్రాక్టర్లకు వత్తాసుగా మధ్యవర్తులు వేలం పాటదారులతో బేరసారాలు నిర్వహించారు. మేకల సంత వేలం సుమారు 40 లక్షల వరకు, వారాంతపు సంత 5 లక్షల వరకు తమ సొంతమైతే పాటదారులకు 10 వేల చొప్పున గుడ్ విల్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకునేందుకు బహిరంగంగానే బేరసారాలు నిర్వహించారు.
మూడు నెలలుగా పంచాయతీ సిబ్బందికి జీతాలు కరువు: మేజర్ గ్రామపంచాయతీ నవీపేట్ లో 40 మంది సఫాయి కార్మికులు 8 మంది పంచాయతీ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. వీరి జీత బత్యాలు మేకల, వారాంతపు సంత వేలంపైనే ఆధారపడి ఉంటాయి. అటువంటి వేలం పాటను సిండికేట్ చేసేందుకు కొంతమంది పెద్దలు, యువకులతో పాటు అధికార యంత్రాంగాన్ని మచ్చిక చేసుకుని కాంట్రాక్టర్ వేలల్లో ఖర్చు చేసి లక్షల్లో ఆదాయం సమకూర్చుకునేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి జిల్లా పాలన అధికారితో పాటు యంత్రాంగం స్పందించి వేలం పాటలను పారదర్శకంగా నిర్వహించే విధంగా కృషిచేసి గ్రామపంచాయతీ ఆదాయాన్ని గణనీయంగా పెంచాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ప్రేక్షక పాత్రలో అధికార యంత్రంగం: నవీపేట్ మేజర్ గ్రామపంచాయతీకి ప్రధాన ఆదాయపు వనరులైన సంతల వేలంపాటలో బహిరంగంగానే పటాదారులను వేలం పాట పాడకుండా ఒత్తిడీలు అధికారుల సమక్షంలోనే చేస్తున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహించడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాంట్రాక్టర్లు కారోబార్ నుండి కలెక్టర్ల దాకా మామూళ్లు సమకూర్చి తమకు అనుకూలంగా వేలంలను దక్కించుకోవడమే కాక కిస్తులను కట్టే విషయంలో సైతం పాలకవర్గంతో కుమ్మక్కై ఇష్ట రాజ్యాంగ చెల్లింపులు జరుపుతున్నారని బహిరంగంగానే పలువురు విమర్శిస్తున్నారు. కాబట్టి జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవ చూపి గ్రామ పంచాయతీకి గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చేందుకు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.