హైదరాబాద్ : రసాయనాలు, వ్యవసాయోత్పత్తుల తయారీదారు ఎవెక్సియా లైఫ్‌కేర్ లిమిటెడ్ బోర్డు సెప్టెంబర్ 16న భేటీ కానున్నట్లు వెల్లడించింది. ఈ సమావేశంలో నిధుల సమీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది. కన్వర్టిబుల్ ఈక్విటీ వారెంట్లు లేదా ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన జారీ చేయడం ద్వారా నిధులు పొందడానికి సభ్యుల ముందు ప్రతిపాదన, ఆమోదానికి పెట్టనుంది. కాగా దీనికి రెగ్యూలేటరీ ఆమోదం లభించాల్సి ఉంటుంది. ఇంతక్రితం 2022 జులై 9 జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో విదేశీ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్ల జారీని ఆమోదించినట్లు ఆ కంపెనీ గుర్తు చేసింది.