మాజీ సీఎం చంద్రబాబుకు బెయిల్ పట్ల హర్షం

– పటాకులు పేల్చిన టిడిపి నాయకులు
 నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో హుస్నాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ 70 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేని చంద్రబాబును రెస్ట్ చేయడం సిగ్గుచేటు అన్నారు. 51రోజులుగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకున్నా అక్రమంగా నిర్బంధించారని విమర్శించారు. నేడు హై కోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం శుభాపరిణామమని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరకు సత్యమే గెలుస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు తిరిగి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ ప్రజా సమస్యల పై పోరాటం కొనసాగిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వరయోగుల శ్రీనివాస్, బొల్లి హనుమంతు, బత్తుల శంకర్, ఎండీ నసుర్, రాజు, నార్లపురం శంకర్, వెంకటేష్, ఎండీ.హాసన్, రమణారెడ్డి ,శంకర్, ఆంజనేయులు, షారుఖ్, రవీందర్, సంజీవ్, సాయిలు, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.