గంట లింగయ్య యాదవ్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా..

Ex gratia to Ganta Lingaya Yadav's family..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి జిల్లా సెర్ప్ సంస్థలో గత 23 సంవత్సరాలుగా ఏపీఎంగా పనిచేసిన గంట లింగయ్య యాదవ్ ఏప్రిల్ 18, 2024న అనారోగ్యంతో మరణించగా.. ఆయన కుటుంబానికి సెర్పు సంస్థ నుంచి రూ.10 లక్షల రూపాయలను, లక్ష యాభై వేల రూపాయల చెక్కులను ఆయన నామిని గంట సుమలతకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ టీ నాగిరెడ్డి, హెచ్ఆర్ ఏపిఎం కవిత, శ్రీనిధి ఆర్ఎం రామకృష్ణ పాల్గొన్నారు.