నవతెలంగాణ – ముత్తారం
ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన బోడ రాజయ్య ఇటీవల మృతి చెందాడు. బుధవారం ఆయన కుటుంబ సభ్యులను మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు పరామర్శించారు. ముందుగా మృతుని చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు ఎడవేన సంపత్, చొప్పరి సంపత్, కల్వల శ్రీను తదితరులున్నారు.