జూట మాటలతో బీజేపీ..మాయ మాటలతో కాంగ్రెస్ మట్టికొట్టింది: మాజీ మంత్రి హరీష్ రావు

– ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరీశ్ రావు 
– రైతుల ఉసురుపోసుకుంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం 
– అత్యంత -ప్రమాధకరమైన పార్టీ బీజేపీ..
– ప్రశ్నించే గొంతుకను పార్లమెంట్ కు పంపించాలని విజ్ఞప్తి
– ఇథనాల్ పరిశ్రమ రద్దుకు అండగా ఉంటానని హామీ
నవతెలంగాణ – బెజ్జంకి
దేశానికి,రాష్ట్రానికి,జిల్లాకు అభివృద్ధి చేయలేని జూట మాటల బీజేపీ..మాయ మాటలతో రైతుల ఊసురుపోసుకుంటూ ప్రజల నోట్లో మట్టికొట్టిని కాంగ్రెస్ పార్టీలకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు.గురువారం మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారానికి హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరవ్వగా మండల బీఆర్ఎస్ శ్రేణులు ఒగ్గుడోలు,డప్పు చప్పుల్లతో ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బస్టాండ్ అవరణం వద్ద ఏర్పాటుచేసిన ఎన్నికల ప్రచార సభలో హరీశ్ రావు మాట్లాడారు.అబద్దాలపు హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని..నాలుగు నెలల పాలనలో రైతులకు సాగు,ప్రజలకు తాగు నీరు కరువైందన్నారు.ఎన్నో ఒడిదోడుకులను ఒర్చుకుని రైతులు సాగుచేసిన పంట దిగుబడులను కల్లాల్లో విక్రయించుకునే దుస్థితి దాపురించిదని అగ్రహం వ్యక్తం చేశారు.ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మళ్లీ ఓట్లడగుతున్నా కాంగ్రెస్ కు ప్రజలు తగిన బుద్ది చేప్పాలన్నారు.అత్యంత ప్రమాధకరమైన పార్టీ బీజేపీ పార్టీయేనని..వారు చేసిన అభివృద్ధి పనుల్లేకా,చెప్పుకోల్లేని పథకాల్లేకా ఓట్లకోసం చిత్ర పటాలు పంచుతున్నారని..తెలంగాణ రాష్ట్రం పక్షాన వినోద్ కుమార్ ను పార్లమెంట్ కు పంపితే కాంగ్రెసోడు భూమ్మిదకు వస్తాడని సూచించారు. గుగ్గిళ్ల,పోతారం శివారుల్లో నిర్మిస్తున్న ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని అయా గ్రామాల ప్రజలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే అసలుకే మోసం వస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి కారు గుర్తుకు ఓటేసి బోయినిపల్లి వినోద్ కుమార్ గెలుపులో బెజ్జంకి మండల ప్రజలు తమ సత్తా చాటాలని ప్రజలను అభ్యర్థించారు.
అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం..
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని..హామీలిచ్చి మోసం కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చేప్పాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినిపల్లి వినోద్ కుమార్ ప్రజలకు సూచించారు.రాష్ట్రానికి ప్రధానిగా మోడీ, రాష్ట్రానికి,కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి బండి సజయ్ చేసిన అభివృద్ధేమి లేదని ఆరోపించారు.తెలంగాణ రాష్ట్ర గొంతుకగా పార్లమెంట్ యందు ఉండేలా ఓట్లు వేసి ఎంపీగా గెలిపించాలని బోయినిపల్లి వినోద్ కుమార్ అభ్యర్థించారు.మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,ఎంపీపీ నిర్మల,టీఎస్ స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లాధ్యక్షుడు జీవీ రామక్రిష్ణ,మండల బీఆర్ఎస్ నాయకులు,అయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.