కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమం సాధ్యం: మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి

నవతెలంగాణ- నవీపేట్: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యమవుతుందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంతో పాటు జన్నేపల్లి, సిరన్ పల్లి, లింగాపూర్, నిజాంపూర్, శాఖాపూర్, నాలేశ్వర్ గ్రామాలలో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిరుపేదలతో పాటు రైతులు, యువకులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దశాబ్ద కాలంలో బోధన్ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని విమర్శించారు. భారీ వర్షాల కారణంగా నాలేశ్వర్ మాటు కాలువ  తెగిపోయిందని, నష్టపోయిన ఇండ్లకు సైతం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని సూచించారు. నాలేశ్వర్ మాజీ సర్పంచ్ మగ్గరి నర్సింగ్ రావు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిరన్ పల్లిలో యంచ యువకులు కాంగ్రెస్ కండువా కప్పుకుని పార్టీలో మంత్రి సమక్షంలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, తాహెర్ బిన్ హంధాన్, నగేష్ రెడ్డి, సుధాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, రాజేందర్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.