జిట్టా దశదినకర్మకు హాజరుకానున్న మాజీ మంత్రులు

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
సెప్టెంబర్ 15,  ఆదివారం రోజున ఉదయం 11:00 గం”లకు భువనగిరి బైపాస్ రోడ్డు సాయి కన్వెన్షన్ సెంటర్ లో  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు తెలంగాణ ఉద్యమ నాయకులు స్వర్గీయ జిట్టా బాలకృష్ణారెడ్డి  దశదినకర్మ కార్యక్రమం నిర్వహించినట్లు బిఆర్ ఎస్ పట్టణ అధ్యక్ష,  కార్యదర్శిలు ఏవి కిరణ్ కుమార్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి లు  తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,  సిరిసిల్ల శాసనసభ్యులు  కల్వకుంట్ల తారక రామారావు, సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి  తన్నీరు హరీష్ రావు,  మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు హాజరుకానున్నట్లు  తెలిపారు.