పంతం నెగ్గించుకున్న మాజీ ఎమ్మెల్యే

– పార్టీ జెండా మోసిన నాయకుడికి మార్కెట్ చైర్మన్
నవతెలంగాణ-ముధోల్  ముధోల్  నియోజకవర్గంలోని అతిపెద్ద మార్కెట్ అయినా బైంసా మార్కెట్ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన సీనియర్ నాయకుడు ఆనందరావు పటేల్ కి ఎట్టకేలకు చైర్మన్ పదవి దక్కింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. దీంతో భైంసా మార్కేట్ కమిటీ చైర్మన్ పదవి సామాన్య కార్యకర్త కు దక్కిందని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.కాంగ్రేస్  పార్టీ నుండి గత సార్వత్రిక  ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు అనంతరం మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి తన మాతృ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీళ్ళ ఇద్దరికైన  ముందు ఉన్న ఆనందరావు పటేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి తన అనుచరులకు కాకుండా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మాజీ స్వర్గీయ మంత్రి గడ్డేన్న శిష్యుడు అయిన ఆనందరావు పటేల్ కు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వలాని కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేశారు. అయితే ఒకానొక దశలో గత రెండు నెలల క్రితం మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఆనంద్ రావ్ పటేల్ కి  దక్కే  అవకాశాలు మొండుగా కనిపించాయి. అయితే మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తన  అనుచరుడు  ఓం ప్రకాష్ లడ్డా కు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని పట్టుబట్టడంతో  కొలిక్కి రాలేదని కార్యకర్తలు తెలిపారు. దీంతో అప్పుడే మాతృ పార్టీలో  చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి తనకున్న పాత పరిచయాలతో కాంగ్రెస్ అధిష్టానం వద్ద చక్రం దింపారని కార్యకర్తలు పేర్కొంటున్నారు. దీంతో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న ఆనందరావు పటేల్ కు బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించిందని కార్యకర్తలు అబిప్రాయం పడుతున్నారు. ఏది ఏమైనా నిశ్శబ్ద విప్లవంతో మాజీ ఎమ్మెల్యే విఠల్ రేడ్డి తన మాట నెగ్గించుకున్నారు అన్న వాదనలు సర్వత్రావ్యక్తమవుతున్నాయి.