
మండలంలోని తీగలకుంటపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త ఇట్టిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తండ్రి ఇట్టిరెడ్డి కిష్టారెడ్డి ఇటీవల మృతి చెందగా శనివారం ఆయన కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి, మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ తడకల రాజిరెడ్డి, సీనియర్ నాయకులు ఆవుల మహేందర్, కొక్కుల సురేష్, పొన్నాల లక్ష్మణ్, గవ్వ వంశీధర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు వట్టిపల్లి రవీందర్‌రెడ్డి, నాయకులు సంది శ్రీనివాస్‌రెడ్డి, మెతుకు లింగారెడ్డి, వట్టిపల్లి మాధవరెడ్డి, జాలిగాం ఎల్లయ్య, దయ్యాల రాజు, ఎండీ చాంద్, సిరిగిరి సంజీవరెడ్డి, పోలవేని కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.