
హుస్నాబాద్ నియోజకవర్గం మండల కేంద్రమైన హన్మకొండ రోడ్డులో కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి , కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ , వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, వేములవాడ ఇన్చార్జ్ ఆది శ్రీనివాస్ , హుస్నాబాద్ మండల అధ్యక్షులు బంక చందు అక్కన్నపేట మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.