
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన సంపంగి మహేందర్ సర్పళ్లి తండా వద్ద ద్విచ్రవాహనంపై వెళ్తూ చెట్టు కు ఢీ కోని మృతి చెందాడు. ఈ విషయాన్ని వెంటనే విషయం తెలుసుకున్న దర్పల్లి మాజీ ఎంపీపీ , ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ బాధిత కుటుంబానికి తనవంతుగా రూ.10000పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను మృతి కి గాల కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబానికీ ఎళ్ళ వేళల అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఇమ్మడి గోపి ముదిరాజ్ ఇప్పటికే పలువురు పేద కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఎందరికో ఆపదలో ఉన్నప్పుడు తనవంతుగా సహకారం అందజేస్తునే ఉన్నారని, బాధిత కుటుంబాల అర్థిక స్థితి గతులు సారిగా లేని వారికి కులం మతం ప్రాంతం చుడకుండ అండగా ఉంటున్నారని పలువురు ఇమ్మడి గోపి ముదిరాజ్ చేస్తున్న సేవలకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమం లో మాజీ ఉప సర్పంచ్ గోదా స్వామి, తోగారి సాయిలు, బొల్లారం చిన్న గంగారాం,ముద్దంగుల రాజమల్లు, కొమ్మురైయ్య,గోగుల సాయిలు, ఒడ్డె బలయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.