– క్ష్రతగాత్రులను పరామర్శించిన మంత్రి పొంగులేటి
నవతెలంగాణ-ముదిగొండ
మండలపరిధిలో వెంకటాపురం వద్ద సోమవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢకొీనడంతో మాదాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దంపతులకు గాయాలైనాయి. అదే సమయంలో నేలకొండపల్లి పర్యటనకు వెళుతున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తన కాన్వారు ని ఆపి క్షతగాత్రులను పరామర్శించి చికిత్స కోసం ఖమ్మం కిమ్స్ ఆస్పత్రికి తరలించాలని చెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు.రోడ్డు ప్రమాదం వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.