హైదరాబాద్ కు తరిలివెళ్ళిన మాజీ సర్పంచ్ లు ‌

Ex-Sarpanches who moved to Hyderabadనవతెలంగాణ – ముధోల్ 
సర్పంచ్ పదవి కాలం ముగిసి నెలలు గడిచినా గతంలో చేసిన అభివృద్ధి పనుల కు బిల్లులు రాకపోవటంతో తెలంగాణ సర్పంచ్ ల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్ లో నిరసన తెలుపుటానికి ముధోల్,బాసర మండలాలకు చెందిన మాజీ సర్పంచ్ లు, ప్రత్యేక వాహనంలో  బయలుదేరి వేళ్ళారు. తాము చేసిన అభివృద్ధి పనులకు నేటికీ ప్రభుత్వం బిల్లు లు మంజూరు చేయకపోవటంతో అప్పులు పేరిగిపోయి ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు.తమ బిల్లులు మంజూరు చేసేంతవరకు వరకు శాంతియుత నిరసన తెలుయజేస్తామని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ బయలుదేరిన వారిలో మాజీ సర్పంచ్ లు, రాంచందర్, సాయినాథ్, శివాజీ,దిగంబర్, నాయకులు రమెష్ , రవికిరణ్ గౌడ్,మైసాజీ, కిష్టయ్య, దత్తాద్రి, గౌతం, భుజంగరావు పటేల్, అమృత్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.