నవతెలంగాణ – ఆర్మూర్
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అంటూ గ్రామ పాలనలో గ్రామ అభివృద్ధిలో ముందుండి అప్పులు చేసి అభివృద్ధిలో పాటుపడిన మాజీ సర్పంచులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రేపు చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గ్రామ మాజీ సర్పంచులు. వివిధ గ్రామా పంచాయతీలకు గత 17 నెలల నుండి ఎస్ఎఫ్ సి నిధులు ప్రతి గ్రామంలోనూ సర్పంచులు సుమారుగా రూ.5 లక్షల నుండి రూ.40 లక్షల వరకు సైతం పెండింగ్ బిల్లులు రావాల్సి ఉందని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా: జిల్లా వ్యాప్తంగా 530 గ్రామపంచాయతీలు ఉన్నవి.. జనాభా ప్రతిపాదికన ప్రతినెల స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి పంచాయితీ ఖాతాల్లో జామ అవుతాయి. అదేవిధంగా ఆర్థిక సంఘం నిధులు కూడా సుమారు అంతే మొత్తంలో వస్తాయి ..ఈ నిధులతో జీపీల్లో అభివృద్ధి పనులు చేపడుతూ కార్మికుల వేతనాలు చెల్లించేవారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా రూ.80 కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉంది వివిధ గ్రామాలలో సర్పంచులు అప్పులు తీసుకొచ్చి సగం వరకు వేతనాలు తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లిస్తూ వచ్చినారు. సుమారుగా కోటి వరకు బిల్లులు రావాల్సి ఉందని నియోజకవర్గంలోని నందిపేట సర్పంచ్ సాంబారు వాణి దంపతులు కలెక్టరేట్లో పెట్రోలు పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. రూ. 19 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందని సస్పెండ్ అయినా కల్లెడ సర్పంచ్ లావణ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్న విషయం తెలిసిందే. జిల్లాలోని చాలామంది సర్పంచులది ఇదే పరిస్థితి గ్రామ పంచాయితీల్లో నిధుల కంటే బిల్లులే అధికంగా రావాల్సి ఉందని పలువురు సర్పంచులు వాపోతున్నారు. నెలల తరబడి ట్రైజడి కార్యాలయ చుట్టూ తిరుగుతున్న చెక్కులకు మోక్షం కలగడం లేదు .ఇప్పటికైనా త్వరగా నిధులు బిల్లులు విడుదల అయ్యేలా ప్రభుత్వాలు చరువచూపాలని మాజీ సర్పంచులు పలుమార్లు బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి విన్నవించినారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మాజీ సర్పంచులు పార్టీని వీడలేక..హస్తం గూటికి చేరలేక లోలోన మదన పడుతున్నారు.
బిల్లులను విడుదల చేసి ఆదుకోవాలి: గ్రామ అభివృద్ధిలో మా పాత్ర ఎంతో కీలకమైంది. పనులు చేస్తేనే మేము గ్రామాల్లో తలెత్తుకొని తిరుగుతాం.. బిల్లుల విడుదలకై రేపు చలో హైదరాబాదును విజయవంతం చేద్దాం- ఒక గ్రామ మాజీ సర్పంచ్,ఆర్మూర్ మండలం.