
మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి జయంతి వేడుక పురస్కరించుకొని శనివారం నాడు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జెండగే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యాంసుందర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు నాగేశ్వర చారి, పార్థసారధి రెడ్డి, రామారావు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.