– ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
నవతెలంగాణ – తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మాజీ జెడ్పిటిసి, సీనియర్ నాయకులు రామ సహాయం శ్రీనివాస్ రెడ్డికి శనివారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ములుగు రోడ్ (వరంగల్) అజారా హాస్పటల్ లో అడ్మిటై వైద్యం పొందుతున్నారు. అతన్నీ ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బడే నాగజ్యోతి, బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి హజర హాస్పిటల్ లో పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ప్రస్తుతం మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉందాని వైద్యులు పేర్కొన్నట్లు తెలిపారు.