నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో రెగ్యులర్, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఎస్ఎస్సి, ఓ ఎస్ ఎస్ సి, ఎస్ఎస్సి ఒకేషనల్ విద్యార్థులు చదివినవారు, ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు 2025లో నిర్వహించబోయే పరీక్షలకు పరీక్ష ఫీజు నవంబర్ 18 లోపు చెల్లించాలని డిఈఓ సత్యనారాయణ తెలిపారు. రెగ్యులర్, ఫెయిల్ అయిన వారికి (మూడు సబ్జెక్ట్స్ ) కన్నా ఎక్కువ అయినవారికి 125 రూపాయలు, మూడు సబ్జెక్షన్ తక్కువైన వారికి 110 రూపాయలు చెల్లించాలని, లేట్ ఫీజు 50 రూపాయలు తో డిసెంబర్ 2 లోపు , డిసెంబర్ 12వ తేదీన 200 రూపాయలతో అపరాధ రుసుము, డిసెంబర్ 21వ తేదీ లోపు 500 రూపాయల అపరాధ రుసుముతో చెల్లించవచ్చు అన్నారు. విద్యార్థులందరూ సకాలంలో పబ్లిక్ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా కోరారు.