– సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు
నవతెలంగాణ – వనపర్తి
ఆశా కార్యకర్తలకు నష్టం కలిగించే పరీక్షను పెట్టే నిర్ణ యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మండ్ల రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ, కలెక్టర్ కార్యాలయ ఏవోలకు ఆశా కార్యకర్తలకు పరీక్ష పెట్టే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సమ్మె సంద ర్భంగా గత ప్రభుత్వం ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరు తూ శుక్రవారం వినతి పత్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు నేటికీ ఫిక్స్డ్ వేతనం లేదని, ఫిక్స్డ్ వేతనం కోసం ఉద్యమించాలన్నారు. ఆశ వర్కర్స్‌కు నష్టం కలిగించేలా, ఉద్యోగులను ఇబ్బంది పెట్టే సమస్యలు సష్టించి ఆశ వర్కర్స్‌కు పరీక్ష పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం తగదన్నారు. చదువుతో సంబం ధం లేకుండా కొంతమంది ఆశ వర్కర్లు ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆశ వర్కర్లు ఒకవైపు పనిభారంతో ఇబ్బంది పడుతుంటే రిటైర్మెంట్ అయ్యే వయసులో పరీక్ష పెడతామనడం సరైనదికాదన్నారు. పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పల్స్ పోలియో, లెప్రసి తదిత ర పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జూన్ 1న పీహెచ్‌సీలలో మెడికల్ ఆఫీసర్లకు విన తి పత్రాలు ఇవ్వాలని, జూన్ 13న జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని సంఘం పిలుపునిచ్చిందన్నారు. ఈ కార్య క్రమాలను ఆశ వర్కర్స్ అందరూ కలిసికట్టుగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్, ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బుచ్చమ్మ, సునీత, జిల్లా నాయకురాలు దేవమ్మ, శాంతమ్మ, శ్యామల, పార్వతి, అర్చన, తదితరులు పాల్గొన్నారు.