నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ అనుబంధ కళాశాలల పరిధిలోని ఎంబీఏ,ఎంసీఏ, ఐఎంబీఏ,10వ, సెమిస్టర్ రెగ్యులర్ బ్యాక్ లాక్ కోర్సుకు పరీక్షలకు ఫీజు తేదీ అపరాధ రుసుముతో పొడిగించినట్లు తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం అరుణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఫీజు చెల్లించుటకు చివరి తేదీ 01-04 వరకు ఉండగా 100 రూపాయల అపరాధ రుసుముతో 04-04 వరకు చెల్లించుటకు అవకాశం ఉందని తెలిపారు.ఎంబీఏ,ఎంసీఏ, ఐఎంబీఏ, ఒక్క సబ్జెక్టుకు 250/ రూపాయలు కాగా రెండు సబ్జెక్టులకు 500/ రూపాయలు రెండు సబ్జెక్టుల కంటే ఎక్కువ ఉంటే 800/ రూపాయల ఫీజు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారిని ప్రొఫెసర్. ఎం.అరుణ వివరించారు. పూర్తి వివరాలకు సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ లను సంప్రదించగలరు. ఇందుకు సంబంధించిన వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచడం జరిగిందని కంట్రోలర్ తెలిపారు.